Women’s Health: పీసీఓఎస్‌‌తో బాధపడుతున్నారా..? ఈ ఫుడ్స్‌ తినొద్దు..!

Written by enosinee

Published on:

Women’s Health: ప్రస్తుతం పీసీఓఎస్‌తో ఇబ్బందిపడే వారి సంఖ్య ఎక్కువుతోంది. పీసీఓఎస్‌తో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలు తీసుకుంటే.. లక్షణాలు మరింత తీవ్రం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

​Women’s Health: పీసీఓఎస్‌.. ప్రతి పది మంది మహిళల్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ సమస్య ఒకసారి వచ్చిందంటే.. దీర్ఘకాలం పాటు వేధిస్తుంది. పీసీఓఎస్‌ ఉన్న మహిళల్లో అసాధారణ స్థాయిలో ఆండ్రోజన్స్ (పురుష హార్మోన్లు) ఉత్పత్తవుతుంటాయి. ఇవి అండాశయాలపై చిన్న చిన్న సిస్టుల్లాగా కనిపిస్తుంటాయి. ఆడపిల్లల్లో సాధారణంగా ఆండ్రోజెన్‌ కంటే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ఎక్కువగా ఉండాలి. కానీ పీసీఓఎస్‌ ఉన్నవారిలో ఆండ్రోజెన్‌ ఎక్కువగా ఉంటుంది. దీంతో.. నెలసరి సరిగా రాకపోవడం, అలసట, బరువు పెరగడం, జుట్టు రాలడం, మొటిమలు, పైపెదవి, గడ్డం, పొట్ట, ఛాతీ మీద కూడా అవాంఛిత రోమాలు పెరుగుతాయి. దీన్ని హిర్సుటిజమ్‌ అంటారు. అండం విడుదల కాకపోవడం వల్ల సంతానలేమి ఇబ్బంది పెడుతుంది. పీసీఓఎస్‌ ఉన్నవారిలో.. డయాబెటిస్‌, గుండె సమస్యలు, హైపర్‌టెన్షన్‌ వచ్చే ముప్పు పెరుగుతుంది. పీసీఓఎస్‌ ఉన్నవారు.. కొన్ని ఆహారాలు తీసుకుంటే.. లక్షణాలు మరింత తీవ్రతరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.​

Leave a Comment