రెండు వరుస పరాజయాలతో వన్డే సిరీ్‌సను చేజార్చుకొన్న భారత మహిళల జట్టు.. కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించాలనుకొంటోంది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో 0-2తో..
ముంబై: రెండు వరుస పరాజయాలతో వన్డే సిరీ్‌సను చేజార్చుకొన్న భారత మహిళల జట్టు.. కొత్త ఏడాదిని విజయంతో ఆరంభించాలనుకొంటోంది. మూడు మ్యాచ్‌ల సిరీ్‌సలో 0-2తో వెనుకంజలో ఉన్న టీమిండియా.. మంగళవారం జరిగే మూడో, ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియాను ఓడించి పరువు కాపాడుకోవాలనుకొంటోంది. అయితే, మన బ్యాటింగ్‌కు వెన్నెముక అయిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ పేలవ ఫామ్ జట్టు విజయాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ క్రమంలో స్వదేశంలో ఆసీస్ చేతిలో ఎదురైన తొమ్మిది వరుస ఓటములకు బ్రేక్ వేయాలంటే కౌర్ కెప్టెన్సీ ఇన్నింగ్స్‌తో కదం తొక్కాల్సిన అవసరం ఎంతో ఉంది. తొలి వన్డేలో భారీ స్కోరు చేసినా.. ప్రత్యర్థిని టీమిండియా బౌలర్లు సమర్థంగా అడ్డుకోలేక పోయారు. రెండో వన్డేలో రిచా ఘోష్ (96) పోరాటంతో విజయం ముంగిట నిలిచినా.. అమన్‌జోత్, దీప్తి శర్మ మ్యాచ్‌ను ముగించలేక పోయారు. ఈ మ్యాచ్‌లో హర్మన్ సేన ఏకంగా ఏడు క్యాచ్‌లు చేజార్చడం భారత ఫీల్డింగ్ ఎంత నాసిరకంగా ఉందో చెప్పకనే చెబుతోంది. అయితే, కంకషన్‌కు గురైన స్పిన్నర్ స్నేహ్ రాణా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉంటుందని టీమిండియా కోచ్ అమోల్ మజుందార్ చెప్పాడు. మరోవైపు ఏకైక టెస్టులో ఓడినా.. వన్డే సిరీ్‌సను ఈపాటికే దక్కించుకొన్న ఆస్ట్రేలియా క్లీన్‌స్వీ్‌పపై గురిపెట్టింది. కెప్టెన్ అలిస్సా హీలీ విఫలమవుతున్నా.. లిచ్‌ఫీల్డ్, పెర్రీ, మెక్‌గ్రాత్ అండతో మెరుగైన స్కోర్లు చేస్తోంది. బౌలింగ్‌లో వేర్హమ్, కిమ్ గార్త్, సదర్లాండ్ రాణిస్తున్నారు.
జట్లు (అంచనా)
భారత్: యాస్తిక భాటియా, స్మృతీ మంధాన, రిచా, జెమీమా, హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), దీప్తి, అమన్‌జోత్, పూజా వస్త్రాకర్, రాణా, శ్రేయాంక, రేణుక.
ఆస్ట్రేలియా: లిచ్‌ఫీల్డ్, హీలీ (కెప్టెన్), పెర్రీ, బెత్ మూనీ, తహిల, గార్డ్‌నర్, సదర్లాండ్, వేర్హమ్, అలన్ కింగ్, గార్త్, బ్రౌన్.